బ్యాంకాక్‌లో స్క్రిప్ట్‌….స్పందించిన పూరి

121
puri
- Advertisement -

కమర్షియల్ సినిమాకి త‌న‌దైన మార్క్‌, మీనింగ్ ఇచ్చిన ఏకైక దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ..తనదైన డైలాగ్‌లతో మాస్‌ ప్రేక్షకులను కట్టిపడేయగల నేర్పరి. హీరో ఎవరైన వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ స్పీడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సంఘంలో అరాచ‌కాల్ని ప్ర‌శ్నిస్తూ.. పూరి సినిమాల్లో క‌థానాయ‌కుడు వేసే ప్ర‌తి పంచ్ డైలాగ్‌ హైలెవ‌ల్‌ని ట‌చ్ చేస్తుంది.

తొలి సినిమా ‘బద్రి’లోనే తనదైన మార్కును ప్రదర్శించిన పూరి ఆ తరువాత సాగించిన ప్రయాణం కూడా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే పూరి…సినిమా కథలు ఎక్కువగా బ్యాంకాక్ ఒడ్డున రాస్తారని ప్రచారం జరుగుతుండగా దానిపై స్పందించారు పూరి జగన్నాథ్.

ఉదయాన్నే పొద్దున్నే తొమ్మిది గంటలకు బీచ్‌కి వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు వస్తా. అప్పటిదాకా అక్కడ రిలాక్స్ అయి ఆ తర్వాతే రూమ్ కి వచ్చి స్క్రిప్ట్ పనులు చూసుకుంటాను. అంతే కాని నేను బ్యాంకాక్ బీచ్ లలో కూర్చొని స్క్రిప్ట్ రాయను అని తెలిపారు.

- Advertisement -