ఆ డైరెక్ట‌ర్ పై క‌న్నేసిన దిల్ రాజు..

271
dil-raju
- Advertisement -

విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ టాలీవుడ్ లో టాప్ ప్రోడ్యూస‌ర్ గా ఎదిగాడు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు. కొత్త న‌టిన‌టుల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమాలు తీస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తోన్నాడు. ప్ర‌స్తుతం నితిన్ హీరోగా శ్రీనివాస క‌ళ్యాణం, మ‌హేశ్ బాబు, వంశీ పైడిప‌ల్లి  కాంబినేష‌న్ లో ఓ సినిమాను తీస్తోన్నాడు. ఇక తాజాగా ఉన్న స‌మాచారం కోసం దిల్ రాజు ఇటివ‌లే స‌క్సెస్ సాధించిన ఓ డైరెక్ట‌ర్ పై క‌న్నేశాడ‌ని తెలుస్తోంది. ఆ డైరెక్ట‌ర్ తో సినిమా తీయ‌డానికి ప్లాన్ చేస్తోన్నాడు దిల్ రాజు.

dil raju, mohanakrishana indraganti

కొత్త కొత్త క‌థ‌ల‌ను సృష్టిస్తూ స‌క్సెస్ తో దూసుకుపోతున్నాడు డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. ఇటివ‌లే వ‌చ్చ‌న స‌మ్మెహ‌నం సినిమాతో భారీ హిట్ ను సంపాదించుకున్నాడు. తెలుగు ఇండ‌స్ట్రీ డైరెక్ట‌ర్ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక మైన గుర్తింపును తెచ్చుకున్నాడు. స్టార్ హీరోలు సైతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణతో సినిమాలు తీయ‌డానికి రెడీ అవుతున్నారు. ప‌లువురు నిర్మాత‌లు కూడా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటితో సినిమాలు తీయ‌డానికి స‌న్నాహాలు చేస్తోన్నార‌ని స‌మాచారం.

sammohanam movie

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి సినిమా తీసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఆయ‌న డేట్స్ ను కూడా అడిగాడ‌ట దిల్ రాజు. టాప్ బ్యానర్ సినిమా అన‌గానే మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కూడా ఓకే చెప్పేశాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమాను తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -