ఈ నగరానికి ఏమైంది…సెన్సార్ పూర్తి

222
Ee-Nagaraniki-Emmaindhi

పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ ఆల్‌ టైమ్‌ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. నేషనల్‌ అవార్డు కూడా సొంతం చేసుకున్న ఈ సినిమా పలు భాషల్లో సైతం రీమేక్‌కు రెడీ అవుతోంది. తాజాగా మరోసారి ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు తరుణ్ భాస్కర్.

ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. 140 నిమిషాల రన్‌ టైమ్‌తో యు/ఎ సర్టిఫికెట్ పొందింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

ee nagaraniki emaindi

ఇటీవలె విడుదల చేసిన సినిమా ట్రైలర్‌తో పాటు ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప‌క్కా హైద‌రాబాద్ భాష‌తో ఈసినిమాలోని డైలాగ్ లు మార్మోగిపోతున్నాయి. స్నేహితుల మ‌ధ్య ఉండే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో తరుణ్ మరోసారి మ్యాజిక్ చేస్తాడో లేదో వేచిచూడాలి.