పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతితో కలిసి సరదాగా సాగే ఓ హారర్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ కాంబో పై అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు. కాంబో న్యూస్ బయటికి రాగానే దేశవ్యాప్తంగా #BanMaruthiFromTFI అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు.
ప్రభాస్ అభిమానుల నుంచి ఇలాంటి రియాక్షన్ ఊహించని మారుతి అండ్ టీమ్ ఇక అఫిషియల్ ఎనౌన్స్ మెట్ ఇవ్వకుండానే సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు. తాజాగా ఈ సెట్లోని ఓ ఫోటో లీకైంది. ఆ తర్వాత ఓ మేకింగ్ వీడియో బయటికి వచ్చింది. ఇవన్నీ డైరెక్ట్ గా షూట్ చేసినవే. అభిమానులు సినిమా, కాంబినేషన్ కు అలవాటు పడాలనే ఉద్దేశ్యంతోనే టీమ్ ఇలా లీక్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా ఒకటి లేదా రెండు లీక్‌లు వచ్చే అవకాశం ఉంది. అభిమానులలో సినిమా గురించి పాజిటివ్ ఫీల్ వచ్చాకే మేకర్స్ అఫిషియల్ గా ఈ సినిమాను ప్రకటించాలని భావిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మిడిల్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తన బిజీ షెడ్యూల్ లో ఈ సినిమా కోసం ప్రభాస్ నెలకి 5 నుండి 10 రోజులు డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు. వరుస ఫ్లాప్స్ తో కెరీర్ లాగిస్తున్న మారుతి ఈ సినిమాతో ఓ బ్లాక్ బస్టర్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..