‘పా.. పా..’ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా: మారుతి

5
- Advertisement -

తమిళ బ్లాక్ బస్టర్ మూవీ డా..డా’ మూవీ తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుద‌ల చేయ‌బోతున్నారు. డిసెంబ‌ర్ 13న‌ ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఆ సంద‌ర్భంగా తాజాగా ‘పా.. పా..’ మూవీ ట్రైల‌ర్‌ను క్రేజీ డైరెక్ట‌ర్ మారుతి విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ.. త‌మిళ సెన్సేష‌న‌ల్‌ మూవీ ‘డా..డా’ తెలుగులో ‘పా.. పా..’ పేరిట విడుద‌ల‌వ్వ‌డం సంతోషంగా ఉంద‌ని, ఈ సినిమా తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ఈ స‌బ్జెక్ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంద‌న్నారు. ‘పా.. పా..’ చిత్ర‌యూనిట్‌కు ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలిపారు.

గ‌త ఏడాది త‌మిళంలో ‘డా..డా’ మూవీ సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. కవిన్, అపర్ణ దాస్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా, డైరెక్ట‌ర్ గణేష్ కె బాబు తెర‌కెక్కించిన‌ ‘డా..డా’ చిత్రం త‌మిళ ఆడియన్స్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంది. కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో డిస్ట్రిబ్యూట‌ర్‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా సుమారు 30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. హార్ట్ టచ్ అయ్యే పాటలు ఈ సినిమాకు మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పటి పాపులర్ సాంగ్స్ మాదిరిగానే ఈ సినిమా పాటలు స్థిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలోని పాటలు చాలా హైలెట్ గా నిలుస్తాయని అన్నారు.

Also Read:ఆర్య వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్

తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కి తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘డా..డా’ చిత్రం ‘పా.. పా..’ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని నిర్మాత నీరజ కోట తెలిపారు. భావోద్వేగం, ప్రేమ, కామెడీ.. ఇవ‌న్నీ సరైన స్థాయిలో మిక్స్ చేసిన ఈ ఫీల్ గుడ్ ఎమోష‌న‌ల్ డ్రామా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా క‌నెక్టు అవుతుంద‌ని, బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వడం ఖాయ‌మ‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుద‌ల చేయ‌బోతున్నార‌ని చెప్పారు.

- Advertisement -