నిర్మాణ రంగంలోకి దర్శకుడు క్రిష్‌..!

354
krish
- Advertisement -

గమ్యం,వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఆయన తీసే సినిమాలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించలేకపోవచ్చు.. కానీ మనసును హత్తుకుంటాయి. కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ట్రెండ్‌ను ఫాలో అయిపోవడం, తీసిన కథలతోనే సినిమాలు తీయడం ఆయన డిక్షనరీలోనే ఉండదు. రీసెంట్ ఎన్టీఆర్‌ బయోపిక్‌ని తెరకెక్కించిన క్రిష్ తాజాగా కొత్త అవతారం ఎత్తనున్నాడు.

ఫీచర్ ఫిల్మ్స్‌తో పాటు వెబ్ సిరీస్‌లను నిర్మించే పనిలో ఉన్నారు క్రిష్. ఇందులో భాగంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను నిర్మించనున్నారు క్రిష్. ఈ సినిమాతో పాటు దర్శకుడు రవికాంత్ పేరెపు తీస్తున్న కొత్త చిత్రానికి కూడా క్రిష్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ఎఎం రత్నం తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా ఓ వైపు దర్శకుడిగా మరోవైపు నిర్మాతగా తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమవుతున్న క్రిష్….నిర్మాతగా ఏమేరకు రాణిస్తాడో వేచిచూడాలి.

- Advertisement -