‘యువకళావాహిని’ అధ్వర్యం లో రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె .వి .రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనం గా జరిగింది . మాజీ ముఖ్యమంత్రి ,గవర్నర్ కె .రోశయ్య చేతుల మీదుగా దర్శకుడు క్రిష్ కె .వి .రెడ్డి అవార్డు ను అందుకున్నారు . కె .వి .రెడ్డి తక్కువ చిత్రాలే తీసినా అన్నీ జన రంజకం గా రూపొందించారని …. ఆ చిత్రాలు తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయని రోశయ్య అన్నారు .
తెలుగు చలన చిత్ర రంగానికి గౌరవాన్ని ఆపాదించిన దర్శకులలో కె .వి .రెడ్డి అగ్ర గణ్యుడని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు . ప్రపంచ చలన చిత్ర రంగానికి పాఠ్యఅంశం గా నిలిచిన అలనాటి చిత్రాలను పాఠ్య గ్రంధాలుగా నేటి దర్శకులు అధ్యయనం చెయ్యాలని అన్నారు . కె .వి .రెడ్డి అవార్డు అందుకోవడమంటే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం తో సమానమని , అవార్డు గ్రహీత క్రిష్ పెరిగిన బాధ్యతతో మరింత మంచి చిత్రాలు చెయ్యాలని అన్నారు .
తన చిత్రం లోని డైలాగ్ లా ‘ జనం చూసేదే మనం సెయాల ‘ అనేదే కె .వి .రెడ్డి గారు అనుసరించిన విధానమని అవార్డు గ్రహీత క్రిష్ అన్నారు . . ‘మాయాబజార్’ కు సరితూగే చిత్రం ఇంతవరకు రాలేదని , తోట రాముడు ను మించిన కమర్షియల్ హీరో లేడని అన్నారు . చిత్ర నిర్మాణం లో కె .వి .రెడ్డి గారి స్ఫూర్తి తో… తప్పటడుగులు వేసినా, తప్పుటడుగులు పడకుండా పయనిస్తానన్నారు .
సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో కె .వి .రెడ్డి గారి తనయుడు కె .రామ చంద్రా రెడ్డి , డా .కె .వి .కృష్ణ కుమారి , గీతాంజలి , తమ్మారెడ్డి భరద్వాజ , బుర్రా సాయిమాధవ్ , జె .బి .రాజు , ‘ సంధ్య ఫిల్మ్స్’ రవి కనగాల, వై .కె .నాగేశ్వర రావు పాల్గొన్నారు . ఈ సందర్భం గా ‘శృతిలయ ఆర్ట్స్ అకాడమీ’ ఆమని సమర్పణ లో కె .వి .రెడ్డి – క్రిష్ చలన చిత్ర సంగీత విభావరి ఆహుతులను అలరించింది.
కె .వి .రెడ్డి అవార్డు అందుకున్న క్రిష్…..
- Advertisement -
- Advertisement -