- Advertisement -
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ వర్సీటీ పేరు మార్పుపై రాజకీయాంగానే కాకుండా సినీ పెద్దలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా పేరు మార్పుపై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు స్పందించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పును తీవ్రంగా ఆక్షేపిస్తూ ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారకరామారావు అని పేర్కొన్నారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోందని, కన్నీరు పెడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -