పవర్‌ స్టార్‌ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ మూవీ..!

212
vijay devarakonda
- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీ చేసున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మరికొన్ని రోజులు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు పూర్తవుతుంది. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగును త్వరలో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లవలసి ఉంది. కానీ ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

వాస్తవానికి ‘పుష్ప’ సినిమా పూర్తికాగానే విజయ్ దేవరకొండ ప్రాజెక్టును మొదలుపెట్టాలని సుకుమార్ అనుకున్నాడు. అయితే ‘పుష్ప’ను రెండు భాగాలుగా చేయడంతో, సుకుమార్ ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశాలు లేవు. అప్పటివరకూ విజయ్ దేవరకొండ వెయిట్ చేయలేడు. అందువలన ఆయన హరీశ్ శంకర్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీ దిల్ రాజు బ్యానర్‌లో చేయబోతున్నట్లు సమాచారం. దిల్ రాజు ఆస్థాన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఫ్యూచర్‌లో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశల్లోనే ఉంది. విజయ్ కి తగ్గ కథను హరీష్ శంకర్ రెడీ చేయగలిగితే.. ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -