కన్నీళ్లు ఆగడం లేదు…మీ వెంటే నేను

257
- Advertisement -

తనపై జరుగుతున్న అసత్యప్రచారంపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. నాగబాబుతో కలిసి ఫిలిం చాంబర్‌కు చేరుకున్న పవన్‌ నల్లదుస్తులు ధరించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు పవన్‌కు మద్దతుగా సినీ పరిశ్రమ నిలిచింది. ఇప్పటికే పలువురు హీరోలు,దర్శకులు పవన్‌కు మద్దతు ప్రకటించగా తాజాగా బాబీ ట్విట్టర్ ద్వారా తన సందేశాన్ని అందించారు.

Director bobby Emotional Tweets on Pawan

తనను తాను నియంత్రించుకోలేకపోతున్నానని, కన్నీళ్లు ఆగడం లేదని తెలిపారు. గ‌డిచిన‌ 48 గంట‌లు నా జీవితంలో అత్యంత క‌ఠిన‌మైన క్ష‌ణాలు. మీరు బాధ‌ప‌డుతున్నార‌ని తెలిసినా, మీరు ఆప‌డం వ‌ల్ల‌ మేము స్పందించ‌లేదు. కానీ, ఇప్పుడు జ‌రుగుతున్న‌ది చూస్తున్న త‌ర్వాత న‌న్ను నేను నియంత్రించుకోలేక‌పోతున్నా అని తెలిపారు. మీరు ఆడ‌వారికి మీరు ఎంత‌ ర‌క్ష‌ణ‌గా ఉంటారో మీతో క‌లిసి ప‌నిచేసిన నాకు తెలుసు. మీరు మీ త‌ల్లికి మాత్ర‌మే బిడ్డ కాదు.. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. మీకు నా సెల్యూట్‌. జైహింద్‌` అంటూ బాబీ ట్వీట్ చేశాడు.

నా ఎమోషన్స్, క‌న్నీళ్లు ఆగ‌డం లేదు..ఈ గడ్డ బిడ్డ. మీకు నా సెల్యూట్ అంటూ ట్విట్‌లో పేర్కొన్నారు‌. పవన్ కు మద్ధతుగా మెగా ఫ్యామిలీతో పాటు మా అసోసియేష్ అంతా అండగా నిలబడింది. కాగా మా అసోసియేషన్ అధ్యక్షుడు నటుడు శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేశారు.

- Advertisement -