మహేశ్… వన్ మ్యాన్ షో

304
Mahesh one man show..
- Advertisement -

మహేశ్ బాబు-కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రీమియర్ షో చూసినవాళ్లు మహేశ్ బాబు హ్యాండ్సమ్ లుక్,నటనకు ఫిదా అయిపోతున్నారు. మహేష్‌ కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్‌ ఇచ్చారని తెలిపారు.

సహజంగానే పాత్ర ఏదైనా మహేశ్ విజృంభిస్తాడు, అందులోనూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యే పాత్రలను పండించడంలో మహేశ్‌కు తిరుగులేదు. భరత్ అనే నేను సినిమాలో సైతం మహేష్ ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్నాడు. విదేశంలో పెరిగి, చదువుకుని వచ్చిన కుర్రాడిలా ఒకవైపు, హుందాతనం, బాధ్యతతో నడుచుకునే సీఎంగా అదరగొట్టాడు.

Bharat Ane Nenu

‘దుర్గా మహల్’ థియేటర్ లోని ఫైట్ సీన్ ఈ సినిమాలోనే కాదు, ఇంతకు ముందు మహేశ్ చేసిన అన్ని సినిమాల్లోని ఫైట్ సీన్స్ ను మించి ఉందని చెబుతున్నారు. ఆడియన్స్ రెప్ప వేయడం మరిచిపోయేలా ఈ ఫైట్ సీన్ ఉందని చెబుతున్నారు. మహేష్ వాయిస్ మాడ్యులేషన్లలో కొత్త మార్పు చూపించాడు. కీలకమైన సీన్లలో హై పిచ్ వాయిస్‌తో ముఖ్యమంత్రి పాత్రకు వందశాతం న్యాయం చేశాడు . అసెంబ్లీ సీన్లలో మహేశ్ డైలాగ్ డెలివరీయే ఆయువుపట్టు. ఓవరాల్‌గా భరత్‌…కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -