తమిళ డైరెక్టర్‌ అట్లీ కుమార్‌తో తారక్..?

569
Jr Ntr’s next to be directed by Atli kumar..?
- Advertisement -

తమిళంలో డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అట్లీ కుమార్. తెలుగులో వచ్చిన ‘రాజా రాణి’, ‘అదిరింది’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అట్లీకుమార్ త్వరలో తెలుగులో ఓ స్టార్ హీరోతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Jr Ntr’s next to be directed by Atli kumar..?

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం అగ్ర కథానాయకుల లీస్టులో ఒకరు. తన నటనతో ఎనలేని అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘అరవింద సమేత’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా అట్లీ కుమార్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నారట. ఎన్టీఆర్‌తో రూపొందించే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పట్టాలెక్కించినున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అగ్రనిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్నితెరకెక్కించనున్నారని సమాచారం. ఇటీవల అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి.’ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఎప్పుడు సెట్ప్‌పైకి వెళుతుందో చూడాలి మరి..!

- Advertisement -