ప్రకృతి ఉద్యమం ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. మొక్కలు నాటాలనే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నినాదం ఉద్యమమై సాగుతుంది. ఎక్కడికక్కడ, ఎవరికివారుగా మనదే ఛాలెంజ్, మనదే ప్రకృతి అనే ఆలోచనతో విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. తమ మిత్రబృందానికి నీడనిచ్చే చెట్లను నాటమని ఛాలెంజ్ విసురుతున్నారు. అందులో భాగంగా తన పుట్టిన రోజు సందర్భంగా.. టాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వైజాగ్‌కు దగ్గరల్లోని అరకులో తన చిత్ర బృందంతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు శ్రీ విష్ణు సీనియర్ నటులు, నటకీరిటీ రాజేంద్రప్రసాద్,నిర్మాత ఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నిజంగా మనందరి బాధ్యతను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకున్నారు. ప్రకృతికి మనిషివల్ల నష్టం జరిగినా.. ఆ నష్టం విపత్తుల రూపంలో మనిషికి నష్టం చేసినా హా.. అందరు చేస్తున్నారు మనం చేస్తున్నం.. మన వరకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం అనే ధోరణితో, ఒక రకంగా చెప్పాలంటే మనిషి బాధ్యతా రాహిత్యంతో పంచభూతాలకు తీరని నష్టం జరిగింది. కానీ, మనందరిలా బిజీ లైఫ్ పేరుతో సంతోష్ గారు తన బాధ్యతల్ని మరిచిపోలేదు.
ప్రజాసేవలో తీవ్రమైన ఒత్తిళ్లున్నా ఏ రోజు విరామం తీసుకోలేదు. ఎవ్వరు మొక్కలు నాటినా, ఎక్కడికి రమ్మన్నాకూడా తన వీలు చూసుకొని వెళ్తుండటాన్ని మనం సోషల్ మీడియాలో చూస్తున్నం. నిజంగా వారికి హ్యాట్సాఫ్ చెప్పలి. థంక్యూ సర్.. మేం మరిచిపోయన బాధ్యతల్ని మీరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా గుర్తు చేసినందుకు. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలి, అందమైన, సమతూకమైన ప్రకృతి ఏర్పాడాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే నా వంతుగా, నా మిత్రులు, శ్రేయోభిలాషులందరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను.