త్వరలో వస్తా…ఫ్లాస్మా ఇస్తా: ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు

202
director ajay bhupathi
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజురోజుకి పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారీన పడగా తాజాగా ఆర్‌ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్లడించిన భూపతి… నాకు వ‌చ్చేసింది..త్వ‌ర‌లో వ‌స్తా.. ప్లాస్మా ఇస్తా అని ట్వీట్ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ త్వ‌ర‌గా ఆయ‌న కోలుకోవాల‌ని ట్వీట్లు చేస్తున్నారు.

తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్‌ని షేక్ చేశాడు అజయ్ భూపతి. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించిన ఈ మూవీతో మంచి పేరు సంపాదించిన భూపతి… ప్ర‌స్తుతం మ‌హా స‌ముద్రం సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నారు.

- Advertisement -