దర్శకత్వం అంత ఈజీ కాదు:త్రివిక్రమ్

269
trivikram
- Advertisement -

అరవింద సమేతతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన మాటల మాంత్రికుడు,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకత్వం వహించడం అంత సులువైన పనికాదని చాలా కాష్టాలుంటాయని తెలిపారు. దర్శకుడు మొదటగా కథ రాసుకున్నట్టుగా అన్ని సార్లు మంచి అవుట్ పుట్ రాదన్నారు.

ఏ దర్శకుడు అయినా విజయాన్ని దక్కించుకునేలా కథ రాస్తాడు కానీ దాన్ని తెరకెక్కించడంలో జరిగే లోటు పాట్ల వల్ల ఫలితం తారుమారు అవుతుందన్నారు. కథ రాసుకున్నాక అది కెమెరామెన్ – నటీనటులను దాటుకుని ఆ తర్వాత అనేక లేయర్లను దాటాల్సి వస్తుందన్నారు. వీటిలో ఏది బెడిసికొట్టినా ఆ ప్రభావం సినిమాపై కనిపిస్తుందన్నారు.

మాటల మాంత్రికుడు అంటూ తనను పిలవడం అస్సలు నచ్చదని తెలిపారు. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత సంక్లిష్టసమయంలో ఉన్న తాను చేసిన అరవింద సమేత ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రెడిట్ అంతా ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. అరవింద సమేత తర్వాత ప్రస్తుతం త్రివిక్రమ్..అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

- Advertisement -