బాంబు పేలుళ్లకు 5 గురికి ఉరిశిక్ష..

290
Dilsukhnagar-Bomb
- Advertisement -

2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ కు చెందిన ఐదుగురి నిందుతులను దోషులుగా నిర్దారిస్తూ ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయ స్థానం ఉరి శిక్ష విధించింది. మూడున్నర  ఏళ్లపాటు  కేసును విచారించిన  న్యాయస్థానం  ఈనెల 13 న మంగళవారం  వీరిని దోషులుగా నిర్ధారిస్తూ..కేసు ఖరారు చేసిన విషయం  తెలిసిందే. అయితే శిక్ష ఏంటనేది మాత్రం ఈనెల 19న వెల్లడిస్తున్నట్టుగా చెప్పింది. అందులో భాగంగానే సోమవారం ఉరిశిక్ష వేస్తు సంచలన తీర్పు వెలువరించింది. అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియా ఎర్‌ రెహమాన్‌ అలియాస్‌ వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోనూ, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్‌లను నేరస్థులుగా నిర్ధారించి ఉరిశిక్షను విధిస్తున్నట్టు ప్రకటించింది.

Dilsukhnagar-Bomb

2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. ఈ ఐదుగురు దోషులు హత్య, హత్యాయత్నం, దేశద్రోహం, కుట్ర వంటి అభియోగాలకు సంబంధించి ఐపీసీ 120బీ, 121, 121ఏ, 122, 307, 316, 318, 436, 466, 474, 201 రెడ్‌విత్‌ 34, 109 సెక్షన్లతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 35, ప్రజా ఆస్తుల ధ్వంసం చట్టంలోనిసెక్షన్‌ 4, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టంలోని 16, 17, 18, 19 సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన వకాస్‌పై విదేశీయుల చట్టంలోని సెక్షన్‌ 14, 2 ఆఫ్‌ 3 కింద నేరం నిరూపణ అయింది. చర్లపల్లి జైలులోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో తుది వాదనల అనంతరం నిందితులకు కోర్టు శిక్షలు ఖరారు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడు పాకిస్థాన్‌లో ఉన్నట్లు గట్టిగా వాదిస్తున్న ఎన్‌ఐఏ.. ఇంటర్‌పోల్‌ నోటీసు కూడా జారీచేసింది. దేశంలో ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులపై నేరం రుజువైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం. బాంబు పేలుళ్లతో నెత్తుటేర్లు పారించిన ఉగ్రమూకలకు ఉరిశిక్ష పడడంతో..బాధితుల కుటుంబాలతో పాటు..ప్రజలకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -