కరుణ్ ‘ట్రిపుల్’ ధమాకా..

221
karun-nair
- Advertisement -

భారత మిడిల్ ఆర్డర్ క్రికెటర్ కరుణ్ నాయర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో నాయర్‌ త్రిపుల్ సెంచరీతో చల రేగిపోయాడు. 303 పరుగులతో భారత్‌ లో త్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. భారత్ తరుపున సెహ్వాగ్ తర్వాత త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మిడిల్ ఆర్డర్‌ లో బ్యాటింగ్ కు ఎక్కిన కరుణ్ ఓ వైపు భారత క్రికెట్ బోర్డును పరుగులు పెట్టిస్తూనే తన వ్యక్తిగత స్కోరును పెంచుకున్నాడు. కరుణ్‌ ( 303 నాటౌట్ 381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు ) వ్యక్తి గత స్కోరుతో భారత్ 759  పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.

karun-nair

మరొకవైపు తొలి సెంచరీని త్రిపుల్ సెంచరీగా మార్చిన భారత ప్రథమ ఆటగాడిగా నాయర్ నిలిచాడు. రోహిత్ శర్మ గాయంతో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో నాయర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. గత మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైన నాయర్.. ఈ మ్యాచ్లో పరుగుల దాహంతో చెలరేగిపోయాడు. కరుణ్ నాయర్ మూడొందల మార్కును చేరే క్రమంలో తన చివరి 50 పరుగులను సాధించడానికి 33 బంతులను మాత్రమే ఆడాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ రోజు ఆటలో అతనికి జతగా అశ్విన్ (67), జడేజా(51)లు రాణించారు.

అయితే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన తరువాత భారత తన ఇన్నింగ్స్ ను 759/7 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్ టెస్టుల్లో అత్యధిక స్కోరును సాధించింది. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై భారత్ 726 పరుగులే భారత్ కు ఇప్పటివరకూ టాప్ స్కోర్. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది.

- Advertisement -