దిల్ రాజు ‘తెగింపు’

126
- Advertisement -

ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు సంక్రాంతి పోటీలో చిరు , బాలయ్య సినిమాలతో పాటు విజయ్ వారసుడుని రంగంలో దింపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలో ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కుంటున్న దిల్ రాజు తాజాగా మరో సంక్రాంతి సినిమాను చేజిక్కించుకున్నాడని తెలుస్తుంది.

హీరో అజిత్ తునివు కూడా పొంగల్ రేస్ లో ఉంది. ఈ సినిమాను తెలుగులో వేరే నిర్మాత కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ దిల్ రాజు బేనర్ చేతిలో పడిందని అంటున్నారు. మూడు కోట్లకు దిల్ రాజు తునివు తెలుగు రైట్స్ అందుకున్నాడని సమాచారం. ఈ సినిమా తెలుగులో తెగింపు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 11 న సంక్రాంతి స్పెషల్ గా మిగతా సినిమాల కంటే ముందే తెగింపు రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి…

దళపతి 67లో కొత్త విలన్‌..?

దర్శకుడిని మార్చేసిన శేష్!

విజయ్ మళ్లీ రష్మిక తోనే

 

- Advertisement -