శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా మొదలై చాలా నెలలవుతుంది. కొన్ని బ్రేకులతో అప్పుడప్పుడు షూట్ జరుపుకుంటుంది. అయితే ఇటివలే ఈ సినిమా షూటింగ్ జరగడం లేదని , శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్ 2 షూట్ లో బిజీ అయిపోయాడనే వార్త చక్కట్లు కొట్టింది. తాజాగా ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
“RC15 షూటింగ్ శరవేగంగా జరుగుతుందని ప్రస్తుతం న్యూజీ ల్యాండ్ లో సాంగ్ షూట్ జరుపుకుంటుందని తెలిపాడు.” అంతే కాదు శంకర్ ఇండియన్ 2 షూట్ లో బిజీ గా ఉన్న మాట నిజమే కానీ నెలలో ఆ సినిమాకు పన్నెండు రోజులు RC15 కి పన్నెండు రోజులు కేటాయిస్తున్నారని, ముందే నేను రాం చరణ్ ఇదంతా ఊహించామని , ఓవర్ లోడ్ అవుతుండటం నిజమే కానీ పరిస్థితులు అలా వచ్చాయని అన్నాడు దిల్ రాజు.
ఇక సంక్రాంతి రిలీజ్ విషయంలో మైత్రి , మేము బాగానే ఉన్నామని మూడు సినిమాలు సహజమే అని కానీ మైత్రి నిర్మాతలకు లేని ఇబ్బంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఎందుకని దిల్ రాజు వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ టివీ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఈ విషయాలపై ఇలా స్పందించాడు.
ఇవి కూడా చదవండి…