దిల్ రాజుకు – రాశీఖన్నాకు చెడిందా?

251
dil raju -rashi khanna
- Advertisement -

సినిమా ఓ రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరి జీవితాలు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాయో.. ఎప్పుడూ అంధపాతాళంలో ఉంటాయో ఊహించడం కష్టం. సినిమా పరిశ్రమ ఒకసారి పూలపల్లకిలో ఊరేగిస్తుంది.. మరోకసారి పూర్తిగా నేలమీద పడేస్తుంది. సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి అంతార్ధరంగా అవకాశాలు రాక రోడ్డు మీద పడ్డ వారు ఉన్నారు. సినిమా హిట్టు అయితే ఆహా.. ఓహో అనే వారు ఉంటారు.. సినిమా ఫెయిలైతే ఇక అంతే సంగతులు. అవకాశాల సంగతి అటుంచితే నిందల పాలు కావాల్సి వస్తుంది.

dil raju -rashi khanna

సినిమా ఫెయిలైతే మొదటగా నిందలు మోసేది హీరోయిన్లే. తాజాగా ఓ హీరోయిన్‌ ఇటువంటి ఇబ్బందులనే ఎదుర్కొంటుందని ప్రచారం జరుగుతోంది. రాశీఖన్నా ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పలు రకాలుగా ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది. ఈ మద్య రాశీఖన్నా పలు గాసిప్పులు షికార్లు పుకార్లు చేస్తున్నాయి.

dil raju -rashi khanna

ఈ మద్య ఈ ముద్దుగుమ్మ నటించిన శ్రీనివాస కల్యాణం సినిమా టాక్‌ ఈ భామపై పెద్ద ప్రభావాన్ని చూపినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా నిర్మాత దిల్‌ రాజుకు, రాశీఖన్నాకు మద్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు, దీంతో రాశీకి సినిమా పరిశ్రమలో అవకాశాలు రాకుండా దిల్‌ రాజు అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్‌ రాజు రాశీకి రాకుండా ఇతర నిర్మాతలకు ఫోన్‌ చేసి చెబుతున్నట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో.. అబద్దమెంతో తెలియాలంటే ఇటు రాశీఖన్నా కానీ అటు దిల్‌ రాజు కానీ స్పందించాల్సి ఉంది. హైదరాబాద్‌లో సెటీలైన రాశీఖన్నా టాలీవుడ్‌లో రాణించాలని ఆశిస్తోంది. ఈ తరుణంలో ఇలాంటి వార్తలు ఈ భామపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

- Advertisement -