దిల్‌రాజు ప్యానల్ ఘన విజయం..

39
- Advertisement -

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు.మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి. స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు.

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ట్‌లో మాత్రం దిల్ రాజు, సీ కళ్యాణ్ ప్యానెల్స్ పోటాపోటీగా నిలబడ్డాయి. ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)లో దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8 మంది సభ్యులు గెలిచారు. ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్‌ని ఎన్నుకున్నారు. వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్, స్రవంతి రవికిషోర్, యలమంచిలి రవిశంకర్, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాట్ల వంటి వారు దిల్ రాజు ప్యానెల్ నుంచి గెలిచారు.

Also Read:బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే..!

- Advertisement -