బలగంకి ఆస్కార్.. ప్చ్ విచిత్రం

66
- Advertisement -

బలగం సినిమాకి ఆస్కార్ వస్తోంది అని దిల్ రాజు భ్రమలో ఉన్నాడా ?, ‘బలగం’ సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పడమే ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఏ నమ్మకంతో దిల్ రాజు ఈ మాట అన్నాడు ?, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పైగా ఆస్కార్ రావాలంటే.. కాస్త ఖర్చు పెట్టాలని దిల్ రాజు నమ్ముతూ ఉండటం మరీ విచిత్రంగా ఉంది. ఇంతకీ దిల్ రాజు ఏం మాట్లాడాడు అంటే.. అతని మాటల్లోనే విందాం.

దిల్ రాజుమాట్లాడుతూ.. ‘ఆస్కార్ కు వెళ్లాలంటే బడ్జెట్ పెట్టాలని అంటున్నారు. దాని గురించి RRR లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయతో ఇప్పటికే మాట్లాడటం జరిగింది. అమెరికాలో స్ట్రీమింగ్ చేయడానికి కొంత బడ్జెట్ అవసరమవుతుందని కార్తికేయ నాకు చెప్పాడు. ఆ బడ్జెట్ ఎంత ?, ఎవర్నీ అప్రోచ్ అవ్వాలి ?, లాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కచ్చితంగా మా బలగం సినిమాని ఆస్కార్ కి పంపిస్తాం అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ఈ సినిమాపై ఇంత నమ్మకం పెట్టుకోవడానికి ముఖ్య కారణం..ఇప్పటి వరకు ఈ బలగం మూవీకి ఏడు ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి.

ఇదే విషయాన్ని దిల్ రాజ్ చెప్పుకొచ్చాడు. అందుకే.. ఆస్కార్ తమ బలగం చిత్రానికి కూడా వస్తోంది అని దిల్ రాజు నముతున్నాడు. మొత్తానికి ఆర్ఆర్అర్ కి ఆస్కార్ రావడంతో.. ఆస్కార్ పై మనవాళ్లకు చిన్నచూపు వచ్చేసినట్టు ఉంది. కాస్త ఖర్చు పెడితే.. ఆస్కార్ కి ఆస్కారం ఉందనే భ్రమలోకి నెట్టేసింది. అసలు బలగం సినిమా ఆస్కార్ స్థాయి సినిమానా ?, అసలు ఫస్ట్ హాఫ్ పరిస్థితి ఏమిటి ?, చాలా స్లోగా ఉంది అని టాక్ నడిచింది. పైగా స్క్రీన్ ప్లే లో చాలా లొసుగులు ఉన్నాయి. ఇవన్నీ దిల్ రాజు మర్చిపోతే ఎలా !

ఇవి కూడా చదవండి..

- Advertisement -