ఎట్టకేలకు వెనక్కి తగ్గిన దిల్ రాజు..

25
dil
- Advertisement -

సంక్రాంతి రేసు నుండి వెనక్కి తగ్గారు నిర్మాత దిల్ రాజు. ఆయన నిర్మించిన వారసుడు జనవరి 11 రిలీజ్ కానుంది. 12న బాలయ్య వీరసింహారెడ్డి, 13న చిరు వాల్తేరు వీరయ్య విడుదల కానున్న నేపథ్యంలో థియేటర్ల సమస్య నెలకొంది. దీంతో థియేటర్ వార్ నెలకొనగా ఎట్టకేలకు వెనక్కి తగ్గారు దిల్ రాజు. మూవీ రిలీజ్ డేట్‌ని మారుస్తున్నట్లు ప్రకటించారు.

జనవరి 14న తెలుగు వెర్షన్‌ని విడుదల చేస్తాం… అయితే తమిళ వెర్షన్ వారిసు మాత్రం జనవరి 11నే విడుదల అవుతుందని తెలిపారు. ఈ సినిమాతో సూపర్‌హిట్ కొట్టబోతున్నాం. అందుకే విడుదల తేది మారిన సమస్య లేదు అని తెలిపారు.

మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. ఆ సినిమాలకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు. కొంతమంది తనను తప్పుపడుతున్నారు వారి మాటలు అస్సలు పట్టించుకోనని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -