విజయ్‌తో మళ్లీ దిల్ రాజు!

26
- Advertisement -

విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబో మరోసారి రానుంది. రీసెంట్‌గా వీరిద్దరూ కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్లీ హిట్ కొట్టేందుకు రాబోతున్నారు.

ఇక గీతాగోవిందం తర్వాత విజయ్‌కు ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. కానీ ఈసారి మాత్రం హిట్ కొట్టడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు విజయ్. ఈ చిత్రానికి రాజా వారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనుండగా వీరిద్దరి కాంబో ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు దిల్ రాజు.

మరోవైపు విజయ్ ప్రస్తుతం గౌతమ్‌తో కలిసి పనిచేస్తున్నాడు. వాస్తవానికి దిల్ రాజు ఓసారి మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్న హీరోతో సినిమా చేయడం కష్టం. కానీ ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా హిట్ కొడతారనే తెలుస్తోంది.

Also Read:విశాఖలో దేవర!

- Advertisement -