300 దాటితే ఈవీఎంల ఎఫెక్టే!

12
- Advertisement -

కేంద్రంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్ని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. ఇక బీజేపీకి 300 దాటితే అది ఖచ్చితంగా ఈవీఎంల ఎఫెక్టేనని తేల్చిచెప్పారు కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్‌.

బీజేపీకి 300కుపైగా సీట్లు వ‌స్తే అవి ప్ర‌జ‌ల ఓట్ల‌తో కాద‌ని, ఈవీఎంల ఊతంతో అని చెప్పేశారు. నిజంగా ప్ర‌జ‌లు ఓటు వేస్తే వారికి మెజారిటీ స్ధానాలు ల‌భించ‌వ‌ని, కాంగ్రెస్‌కు మాత్రం 295 స్ధానాలు (ఇండియా కూట‌మికి) వ‌స్తాయ‌ని అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కాద‌ని అవి కాషాయ కూటమి మేనేజ్ చేసిన పోల్స్ అంటూ ఇప్పటికే ఇండియా కూటమి నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.

Also Read:Sonia:ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే

- Advertisement -