వింత ఆచారం.. వరుడి మెడలో తాళి కట్టిన వధువు

225
12national
- Advertisement -

భారత సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో వధువు మెడలో వరుడు తాళి కడతారు. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటనను చూస్తే ఇదేక్కడి ఆచారం అని నొరెళ్లబెట్టకుంటారు. కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ తాలుకా నాలతవాడ గ్రామంలో వరుడి మెడలో వుధువు తాళి కట్టింది. సోమవారం ఇక్కడ జరిగిన రెండు వివాహాల్లో వధువులే వరుడికి తాళి కట్టారు. వరుడు ప్రభురాజ్‌కు అంకిత, మరో వరుడు అమిత్‌ మెడలో ప్రియా మూడు ముళ్లు వేశారు. అంతేకాకుండా వధువుల వెనకాల అగ్ని చుట్టూ ఏడు అడుగులు వేశారు.

ఇదేం ఆచారం అని అడిగితే.. 12వ శతాబ్దంతో ఇదే పద్దతి అమల్లో ఉండేదని దాన్నే మేము ఫాలో అవుతున్నామని చెప్పారు. ఇవి అసలుసిసలైన బసవణ్ణ సిద్ధాంతాలకు లోబడి జరిగిన వివాహాలని విమర్శకుల నోళ్లుమూయిస్తున్నారట. ఇవి అసలుసిసలైన బసవణ్ణ సిద్ధాంతాలకు లోబడి జరిగిన వివాహాలని చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. వినూత్నంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి పలువురు ఆధ్యాత్మికవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -