ప్రగతి నివేదన సభలో.. క్రేజీ బాయ్‌..!

207
different look in pragathi nivedana sabha
- Advertisement -

యావత్‌ తెలంగాణ ‘ప్రగతి నివేదన సభ’ కోసం చీమలదండులా తరిలి వస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకి తెలంగాణ ప్రజలు తరలి రావడమే కాకుండా..తమ అభిమానాన్ని చాటుకునేందుకు సైతం ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ భారీ బహిరంగ సభకి పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మీదున్న అభిమానాన్ని వినూత్న ప్రయత్నాల్లో చాటుకున్నారు.

different look in pragathi nivedana sabha

ఓ కార్యకర్త అయితే..తన తలపై ఒక వైపు కేసీఆర్, మరో వైపు కేటీఆర్ అని రాయించుకుని వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో ప్రగతి నివేదన సభలో ఆ కార్యకర్త ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. సభాప్రాంగణంలోని జనమంతా..ఆ కార్యకర్త అభిమానాన్ని మెచ్చుకుంటూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

different look in pragathi nivedana sabha

 different look in pragathi nivedana sabha

- Advertisement -