బి‌ఆర్‌ఎస్ కు బీజేపీకి ఉన్న తేడా అదే !

48
- Advertisement -

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ బీజేపీ పార్టీల మద్య పోటీ వాతావరణం అంతకంటకు పెరుగుతుందనే చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఇప్పటికే రెండుసార్లు ప్రజాదరణతో అధికారం చేపట్టిన బి‌ఆర్‌ఎస్ ఒకవైపు ఉంటే.. బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని కల్లబొల్లి మాటలతో మబ్యపెట్టే కమలం పార్టీ మరోవైపు ఉంది. బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రజాబలం ఉందని అందరికీ తెలిసిందే.. అయినప్పటికి వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని తాటాకు చప్పుళ్ళు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. ఏది ఏమైనప్పటికి ఈ రెండు పార్టీల మద్య వచ్చే ఎన్నికల్లో రసవత్తరమైన పోరు ఉందనేది కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం. అయితే ప్రజానిర్ణయంలో ఈ రెండు పార్టీల మద్య ఉండే వ్యత్యాసం కచ్చితంగా ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది.

2014 నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన కే‌సి‌ఆర్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ప్రాజెక్ట్ లతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచుతున్నారు. కరెంట్ కోతల కష్టాన్ని దూరం చేస్తున్నారు. ఇంకా సంక్షేమం విషయంలో కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ తెలంగాణ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడంలో సి‌ఎం కే‌సి‌ఆర్ చేస్తున్న కృషి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.. ఇక మరోవైపు అధికార దాహంతో బీజేపీ చేస్తున్న కుతంత్ర రాజకీయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, తెలంగాణ పట్ల పక్షపాతం చూపించడం, ప్రభుత్వాన్ని కూల్చే కుళ్ళు రాజకీయాలు చేయడం ఇలా బీజేపీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు కొదువే లేదు.

అందువల్ల రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే కే‌సి‌ఆర్ సుపరిపాలననే తెలంగాణ ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్నే ఇటీవల ఐటీ పురపాలక శాఖ మంత్రి కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఆయన.. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఒకరేమో ప్రగతి భవన్ పడగొడతామని, ఇంకొకరేమో సచివాలయం కూలగొడతామని చెబుతున్నారు.. కూల్చే ప్రభుత్వాలు కావాలో లేదా కట్టే ప్రభుత్వాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని చెప్పారు. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే కే‌సి‌ఆర్ కావాలా ? బతుకులను ఆగం చేసే మోడీ కావాలో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి మనం రూపాయి కడితే 40 పైసలు మాత్రామే తిరిగొస్తుందని, మిగిలిన నిధులంతా బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఇది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కే‌టి‌ఆర్. మొత్తానికి బి‌ఆర్‌ఎస్, బీజేపీకి మద్య ఉండే తేడా గురించి తెలంగా ప్రజలకు బాగా తెలుసనిది రాజకీయవాదుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -