కాజల్‌లో ఈ మార్పు గమనించారా..?

310
Kajal agarwal is planning of hiking remuneration
Kajal agarwal is planning of hiking remuneration
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలోకి ఒక్కసారి అడుగుపెట్టాక వెనక్కుచూసుకోవడం అంటూ ఉండకూడదని అనుకుంటారు హీరోయిన్లు.. ఎలాగైనా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవాలని.. నానా కష్టాలు పడి స్లిమ్‌గా‌, గ్లామర్‌గా ఉండడానికి డైట్లు, ఎక్సర్‌సైజ్‌లు, యోగాలు ఇలా ఎవరికి తెలిసినా పద్దతుల్లో వాళ్లు తెగ కష్టపడిపోతుంటారు.. అప్పుడప్పుడూ హాట్ ఫోటోషూట్లకు సై అంటారు.. ఆఫర్లు కావాలంటే తప్పదు కదా.. ఇంకొందరు హీరోయిన్లు తమ ముఖాకృతినే మార్చుకుంటారు.. అందుకోసం ఆపరేషన్లకు సిద్ద పడతారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌ ఇలా అన్ని భాషల్లోనూ రాణిస్తున్న హీరోయిన్లు ఆపరేషన్‌ చేయించుకున్నవాళ్లే.

ఈ ఆపరేషన్లపై కాజల్ అగర్వాల్ ఆ మధ్య ఏమందంటే.. అందంగా కనిపించడానికి ఆపరేషన్స్‌ తప్పేంకాదని.. ఎంతోమంది స్టార్స్ చేయించుకుంటున్నారని.. తాను మాత్రం ఇప్పటివరకు ఒక్క ఆపరేషన్ కూడా చేయించుకోలేదని చెప్పింది. అంతేకాదు తనకు వయస్సు మీదపడ్డ.. చర్మం ముడతలు పడ్డ ఫర్వాలేదు కానీ.. ఆపరేషన్‌ చేయించుకోనని చెప్పిందప్పుడు..  తాజాగా కాస్మటిక్‌ సర్జరీ చేయించుకుందట కాజల్‌. మిగతా హీరోయిన్ల మాదిరిగానే తన కాస్మటిక్‌ సర్జరీ విషయాన్ని కాజల్‌ రహస్యంగా వుంచుతోంది. ఎంత రహస్యంగా ఉంచినా.. ఆమె ముఖం చూస్తే అర్థం కావట్లేదా.. సర్జరీ చేయించుకుందనీ.. ఇప్పటికే హీరోయిన్‌గా ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి, ఎందరో అభిమానుల్ని సంపాదించిన కాజల్‌ ఇప్పుడెందుకు కాస్మటిక్‌ సర్జరీ సాయం తీసుకుందోనని ఆశ్చర్యపోతున్నారంతా. ఇటీవల కళ్యాణ్ రామ్‌తో ఎంఎల్‌ఏ సినిమా చేస్తున్న కాజల్‌.. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొంచెం గమనిస్తూ ముక్కు తీరు బాగా మారిందని ఇట్టే తెలిసిపోతోంది.

kajal in MLA

సౌత్‌లో పదేళ్ల నుండి ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తన మొదటి సినిమాకు ఇప్పటి సినిమాలకు చాలా మారింది. అయితే ఇప్పుడు మరింత అందంగా కనిపించేందుకు ఆమె సర్జరీని ఆశ్రయించింది అంటున్నారు నెటిజన్లు. ఇన్నేళ్లుగా చూస్తోన్న ముఖం కావడంతో ప్రేక్షకులకి బోర్‌ కొట్టేసి వుండొచ్చునని, వారికి కొత్తగా కనిపించడానికే కాజల్‌ ఈ నిర్ణయం తీసుకుందని టాక్‌ వినిపిస్తోంది.

- Advertisement -