వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీకి సౌత్ రాష్ట్రాల భయం పట్టుకుందా ? అంటే అవుననే సమాధానం చెప్పక తప్పదు. ప్రస్తుతం నార్త్ లో బీజేపీకి తిరుగులేకపోయిన సౌత్ లో మాత్రం గడ్డుకాలమే. అందువల్ల సౌత్ రాష్ట్రాలలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికి.. కమలనాథుల ఆశలు మాత్రం ఎప్పటికప్పుడు అవిరవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సౌత్ లో ఉన్న ఏ రాష్ట్రంలోనూ బీజేపీ బలంగా లేదు. నిన్న మొన్నటి వరకు కర్నాటకలో బలంగా ఉన్న కాషాయ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికలతో ఆ రాష్ట్రంలో కూడా పట్టు కోల్పోయింది. దీంతో సౌత్ రాష్ట్రాల మద్దతు లేకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందా అంటే చెప్పడం కష్టమే.
మొత్తం 545 పార్లమెంట్ స్థానాలు ఉన్న దేశంలో అధికారం కోసం 272 సీట్లు సాధించుకోవాల్సి ఉంటుంది. అయితే 2014 లోను, 2019 లోనూ ఏ పార్టీ అండ లేకుండానే అధికారంలోకి వచ్చింది బీజేపీ. 2014 లో 282 సీట్లు సాధించుకోగా, 2019 లో 303 సీట్లు సాధించి ఏకపక్ష ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఇదే స్థాయిలో విజయం నమోదు అవుతుందా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా బలంగా పుంజుకుంది.
Also Read: కమర్షియల్ పాలిటిక్స్.. నిజమేనా ?
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బిఆర్‌ఎస్ వంటి పార్టీలతో గట్టి పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సీట్లు సాధించలేకపోతే అధికారం కోసం పక్కా పార్టీల మద్దతు కోరగా తప్పదు. అలాంటి సమయంలో సౌత్ రాష్ట్రాలలోని పార్టీలది కీలకపాత్ర అవుతుంది. సౌత్ రాష్ట్రాలలో బీజేపీకి సొంత బలం లేదు. మరోవైపు సౌత్ రాష్ట్రాలను శాసించే ఆయా పార్టీల మద్దతు బీజేపీకి ఏ మాత్రం లేదు. తెలంగాణలో బిఆర్‌ఎస్, తమిళనాడులో డీఎంకే, కేరళలో వామపక్షాలు.. ఇలా అన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికలో సౌత్ రాష్ట్రాల భయం బీజేపీని గట్టిగా వేధిస్తోందట. మరి సౌత్ లో పట్టు కోసం బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతుందో చూడాలి.
Also Read: CM KCR:దేశానికే తలమానికంగా తెలంగాణ అభివృద్ధి