‘మహాభారతం’పై పుకార్లు నమ్మోద్దు…..

223
Did Anyone Check Before Writing Rumors
- Advertisement -

దేశంలో బహుబలి చిత్రం సంచలన విజయం సాధించి అన్ని సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అసలు బహుబలిని కట్టప్ప ఎందుకు చంపేశాడు అనే సస్పెన్స్‌పై చాలా సందిగ్దత నెలకొంది. ఎక్కడ చూసిన ఈ విషయం గురించే చర్చ జరుగుతుంది. అయితే బాహుబలి రెండవ భాగాన్ని సరిగా రెండు వారల క్రితం పూర్తి చేసారు డైరెక్టర్ రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది. మూడున్నర సంవత్సరాల కష్టం బాహుబలి కి ఇచ్చిన తరువాత రాజమౌళి తదుపరి చిత్రం ఏది అనేదాని మీద చర్చలు జరుగుతున్నాయి.

Did Anyone Check Before Writing Rumors

అయితే దర్శకుడు రాజమౌళి బహుబలి తర్వాత మహాభారతం తెరకెక్కించబోతున్న అంటూ సోషల్‌మీడియాలో జోరుగా వార్తలు హాల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేశాడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్. మహాభారతం సినిమాపై వస్తున్న కథనాలపై విజయేంద్ర ప్రసాద్ ఘాటుగా స్పందించాడు. కొన్ని వెబ్‌సైట్లు పనిగట్టుకుని ఇలాంటి వార్తలు రాస్తున్నారని ఆయన విమర్శించాడు. తాను ముక్కుసూటిగా మాట్లాడే మనిషినని, మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించాలన్న ఆలోచనే రాజమౌళికి, తనకు లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. వెబ్‌సైట్లు పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.

Did Anyone Check Before Writing Rumors

మహాభారతం విషయంపై క్లారిటీ ఇస్తూ.. ‘అసలు ఈ వార్తలు రాస్తున్న వారిలో ఎవరైనా రాజమౌళిని కానీ.. నన్ను కానీ డీటైల్స్ అడిగారా? ఓ విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే.. మహాభారతం గురించి కనీస మాట వరుసకు కూడా అనుకోలేదు. ఇదో ఓ రూమర్ అంతే’ అని స్పష్టం చేసారు విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం రాజమౌళి ప్రతీ సెకనును బాహుబలి 2 చిత్రీకరణకే కేటాయిస్తున్నాడని…..ఏప్రిల్ 28న బాహుబలిని విడుదల చేయడం పైనే తమ దృష్టంతా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -