సింగిల్ కట్ లేకుండా ‘దిక్సూచి’

337
Dicsuchi release
- Advertisement -

దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చెసుకుని ఈ నెల 26న విడుదలకు సిద్దమవుతొంది.

ఈ సంద‌ర్భంగా దిలీప్ కుమార్ స‌ల్వాది మాట్లాడుతూ… దిక్సూచి సినిమా సెన్సార్ అయింది. ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యులు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈ నెల 26న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. సినిమా చూసి జెమ్స్ గారు అమెరికా లొ విడుదల చేస్తున్నారు. ‌అలాగే ఆస్ట్రేలియాలొ సైతం చాలా లొకెషన్స్ లో విడుదలవుతొందన్నారు.

జెమ్స్ మాట్లాడుతూ.. దిక్సూచి సినిమా చూశాను. కంటెంట్ ఉన్న చిత్రం. అందరికి నచ్చుతుందని అమెరికాలో విడుదల చెస్తున్నాము. చిన్న సినిమా అయినా 15 లొకెషన్ లొ రిలీజ్ చెస్తున్నామన్నారు. నిర్మాత రాజు గారు ప్యాషన్ తో తీసిన చిత్రమిది.టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.

నిర్మాత నర్సింహ రాజు మాట్లాడుతూ.. సినిమా లో కంటెంట్ ఉంది. అందుకే నిర్మాతగా మారి దిక్సూచి తీశాము. విడుదలైన అనంతరం మా సినిమా గురించి ప్రేక్షకులె మాట్లాడతారన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో చాందినీ, సుమన్ పాల్గొన్నారు.

దిలీప్‌కుమార్ స‌ల్వాది, చ‌త్ర‌ప‌తి శేఖర్‌, స‌మ్మెట గాంధీ, చాందిని భ‌గ‌వనాని, సుమ‌న్‌, ర‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, రాకేష్ ధ‌న్వి న‌టించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ:సాయి సతీష్,ప్రొడ్యూస‌ర్స్ఃన‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా స‌ముద్రాల‌, కెమెరాఃజ‌య‌కృష్ణ‌, ర‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః ప‌ద్మనాభ్ భ‌ర‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ త‌ప‌స్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌,కట్స్: డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ స‌ల్వాది.

- Advertisement -