త్వరలో దుబ్బాకలో డయాలసిస్ సెంటర్…

40
yadadri
- Advertisement -

త్వరలో దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు, గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పిల్లల ప్రత్యేక ఐసీయూ యూనిట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్… ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి గజ్వేల్ లో రూ. ఒక కోటి 60 లక్షల రూపాయలతో 40 పడకల పిల్లల ప్రత్యేక icu ను ప్రారంభించుకున్నాం అన్నారు. డయాలసిస్ మిషన్ ల సంఖ్యను 4 నుంచి 8 కి పెంచుకున్నం అని తెలిపారు.

ప్రభుత్వ రంగ ఆసుపత్రులలో సింగిల్ యూజ్ డయాలసిస్ సిస్టం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. ఖరీదైన డయాలసిస్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఏర్పాటు చేశామన్నారు. గజ్వేల్ కు ఇటీవలే కొత్త పార్థీవ వాహనం ను అందించాం…. పేషెంట్ ల అటెండెంట్ ల కోసం రూ.17 లక్షల రూపాయలతో అన్ని వసతులతో అటెండెన్స్ షేడ్ ను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. కాయకల్ప అవార్డ్ కోసం ఆసుపత్రిని సందర్శించిన ఢిల్లీ బృందం ఆసుపత్రి లో రోగులకు అందుతున్న వైద్య సేవలు చూసి అభినందించిందన్నారు.

తెలంగాణలో రూ.32 కోట్లతో 62 మార్చురీలను అధునీకరిస్తున్నాం అని తెలిపిన హరీష్….రూ.28 లక్షల 48 వేల రూపాయల తో గజ్వేల్ మార్చురీ నీ ఆధునీకరిస్తున్నాం అని వెల్లడించారు. నేటి చిన్నారులే రేప‌టి భ‌విష్య‌త్ కాబ‌ట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొత్త‌గా పీడియాట్రిక్ ఐసీయూల‌ను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం మొత్తం రూ. 88 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుందన్నారు.

- Advertisement -