6న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

27
- Advertisement -

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం అక్టోబ‌రు 6వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారికి బుధవారం వెండి నాగపడగ, వెండి కిరీటం తిరుప‌తికి చెందిన సూర నరహరి, కుసుమ దంపతులు ‌ బహూకరించారు. వీటిని దాత‌లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి అంద‌జేశారు.

దాదాపు రూ.14 లక్ష‌లు విలువ గ‌ల 16 కేజీల వెండితో తయారు చేసిన ఆభరణాలను స్వామివారికి బ‌హూక‌రించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రవికుమార్ పాల్గొన్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:శివాజీ – ప్రశాంత్‌లకు 3 స్టార్లు

- Advertisement -