మహిళల్లో మధుమేహం.. చాలా డేంజర్!

31
- Advertisement -

నేటి రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య మధుమేహం. సాధారణంగా వయసు పైబడిన వారిలో కనిపించాల్సిన ఈ డయాబెటిస్.. నేటి రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది దీని బారిన పడుతున్నారు. పిల్లలు, పురుషులు, మహిళలు, వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో డయాబెటిస్ ను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం డయాబెటిస్ బారిన పడుతున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నారట. మహిళల్లో డయాబెటిస్ మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణమౌతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల మహిళల్లో వెజైనా ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తాయట. ఇంకా లైంగిక ఆసక్తి తగ్గడం, సంతాన సామర్థ్యం కూడా తగ్గుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇంకా మధుమేహం ఎక్కువతే మోనోపాజ్ కు దారి తీసే ప్రమాదం ఉందట. ఈ మోనోపాజ్ కారణంగా మహిళల్లో గుండె జబ్బులు పెరుగుతాయట. కాబట్టి స్త్రీలలో మధుమేహం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు, జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో వ్యాయామం ఎంతో ముఖ్యం అందువల్ల ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయడానికి సమయం కేటాయించాలి. ఇంకా ఆకుకూరలు ఎక్కువగా తినాలి. స్ట్రాబెరీ, అవకాడో వంటి ఫలాలను ఆహార డైట్ లో చేర్చుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. శరీరానికి విటమిన్స్, మినరల్స్ ఇచ్చే పానీయాలను సేవించాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. తద్వారా పలు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత వహించవచ్చు.

Also Read:పెళ్లిపుస్తకం తర్వాత లగ్గం : రాజేంద్రప్రసాద్

- Advertisement -