బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’పై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా, విడుదలైన కొద్ది సమయంలోనే ఇది సోషల్ మీడియాలో భారీగా వైరల్‌గా మారింది. ది రివెంజ్ (The Revenge) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ పార్ట్-2పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి.
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ తొలి భాగం రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ చరిత్రలో నిలిచింది. ఇప్పుడు ఆ విజయాన్ని మించి, మరింత భారీ యాక్షన్ సన్నివేశాలు, గట్టిపడిన కథతో సీక్వెల్‌ను రూపొందించినట్లు టీజర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ప్రతీకార థీమ్‌తో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ‘ధురంధర్ 2’ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Yeh Naya Hindustan hai
Yeh ghar mein ghusega bhi
Aur maarega bhiDhurandhar: The Revenge
Teaser Out Now#DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay… pic.twitter.com/YNzCssP1Ve— Jio Studios (@jiostudios) February 3, 2026
Also Read:శాశ్వత్ సచ్‌దేవ్..’ది ఇండియా హౌస్’

