విక్రమ్‌ ‘ధ్రువ నట్చత్తిరమ్’ టీజర్‌..

242
Dhruva Natchathiram
- Advertisement -

హీరోవిక్రమ్- క్రేజీ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో ధ్రువ నక్షత్రం( త‌మిళంలో ధ్రువ నట్చత్తిరమ్) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది. అద్భుతమైన గన్ షాట్స్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ స్టైల్ అలాగే కొన్ని ఫైట్స్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ తెప్పిస్తున్నాయి.
Dhruva Natchathiram

గత కొంత కాలంగా విక్రమ్‌కి విజయాలు లేవు. ముఖ్యంగా తెలుగులో అతని సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ధృవ నచ్చతిరం మాత్రం తప్పకుండా హిట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో పెళ్లి చూపులు భామ రీతూ వర్మ విక్రమ్ లవర్ గా కనిపించనుంది.

ఈ సినిమాలో విక్రమ్‌, పార్తీప‌న్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, సిమ్రాన్‌, డీడీ, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. రాధికా – సిమ్రాన్ వంటి నటీమణులు స్పెషల్ పాత్రల్లో కనిపిస్తున్నారు. హారీస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -