హోళీ శుభాకాంక్షలతో…”ధూం ధాం”

23
- Advertisement -

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇవాళ హోలీ పండుగ సందర్భంగా “ధూం ధాం” సినిమా నుంచి హోలీ శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ ను మూవీ టీమ్ రిలీజ్ చేశారు. ఫారిన్ లొకేషన్ లో చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నడుచుకుంటూ వస్తున్న స్టిల్ ను ఈ పోస్టర్ లో రివీల్ చేశారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా “ధూం ధాం” సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

Also Read:Harishrao:చేరికలేనా..రైతు సమస్యలు పట్టవా?

- Advertisement -