- Advertisement -
ధోని రిటైర్మెంట్‌పై ఆసక్తికర వార్తలు చేశారు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా. ధోని అద్భుఉత ఆటగాడని..క్రికెట్ భవిష్యత్తు ఎంతో ఉందని అయితే రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలో ధోనినే నిర్ణయించుకోవాలన్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్‌పై ఆటగాళ్లే నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రపంచకప్ తర్వాత కొంతకాలం క్రికెట్‌కు విరామం ప్రకటించాడు ధోని. తర్వాత జట్టులోకి వస్తాడని ప్రచారం జరుగుతున్న ధోని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇప్పటికే గంగూలీ,రవిశాస్త్రి,ఎమ్మెస్కే ప్రసాద్ లాంటి వాళ్లు ధోని రిటైర్మెంట్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈవార్తలకు బలం చేకూరేలా బీసీసీఐ సైతం ధోనికి కాంట్రాక్టు ఇచ్చేందుకు నిరాకరించింది.
- Advertisement -