వైరల్‌: ట్రంప్‌తో ధోనీ..!

57
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గోల్ఫ్‌ బ్యాట్ పట్టాడు. అది అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో.న్యూజెర్సీ బెడ్‌మిన్‌స్టర్‌లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో గోల్ఫ్ ఆడేందుకు భారత మాజీ కెప్టెన్‌ను ఆహ్వానించారు ట్రంప్.

ఈ సందర్భంగా ట్రంప్‌తో కలిసి మహి గోల్ఫ్‌ ఆడారు. ధోని వెంట దుబాయికి చెందిన వ్యాపారవేత సంఘ్వీ ఉండగా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ధోనీ గోల్ఫ్‌ ఆడిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.

Also Read:బీజేపీలో ఉండలేకపోతున్నారా?

ధోనికి క్రికెట్‌తో పాటు పలు క్రీడలంటే ఎంతో మక్కువ. ఫుట్‌బాల్‌, టెన్నిస్‌ చాలా ఇష్టం. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు ధోని ఇటీవల అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -