ధోని లాంటి ఫినిషర్ కావాలి..!

443
dhoni
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై ప్రశంసలు గుప్పించారు ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్. ఆసీస్ జట్టుకు ప్రస్తుతం ధోని లాంటి ఫినిషర్‌ కావాలన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ ఓటమికి సరైన ఫినిషర్ లేకపోవడమేనని తెలిపాడు.

గతంలో మైక్ హస్సీ, మైకెల్ బెవాన్ రూపంలో ఇద్దరు మెరుగైన ఫినిషర్లు ఉండేవారని ప్రస్తుతం వారులేని లోటు తెలుస్తుందన్నారు. టీమిండియాలో ధోనీ,ఇంగ్లాండ్‌లో జోస్ బట్లర్ ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారని చెప్పారు

భారత్ ఆశలు వదిలేసిన ఎన్నో మ్యాచ్‌ల్ని ధోనీ తన ఫినిషింగ్ స్కిల్స్‌తో గెలిపించాడని…ధోని తర్వాత ఆ బాధ్యతని కేఎల్ రాహుల్ నిర్వర్తిస్తున్నాడని చెప్పాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మార్చి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

- Advertisement -