- Advertisement -
16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్‌కి ఇటీవలె గుడ్‌బై చెప్పాడు మహేంద్ర సింగ్ ధోని. మహీ షాకింగ్ డీసిషన్‌తో క్రీడా ప్రపంచం షాక్‌కి గురికాగా ధోనితో తమ అనుబంధాన్ని పంచుకున్నారు సినీ,వివిధ దేశాల ఆటగాళ్లు.
ఈ నేపథ్యంలో ధోని గౌరవార్దం ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడేలో ఒక సీటుకి ధోని పేరు పెట్టాలని నిర్ణయించింది.2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్ (బంతి) పడిన సీటుని గుర్తించామని ఆ సీటుని ప్రత్యేకంగా ధోని గౌరవార్దం కేటాయిస్తున్నట్లు తెలిపింది.ఇప్పటికే వాంఖడే
స్టేడియంలో సునీల్ గవాస్కర్‌కి రెండు శాశ్వత సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 1983లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ని భారత్ గెలవగా.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి ఆ సిక్స్‌తో ధోనీ తెరదించాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఆ సిక్స్‌ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు.
- Advertisement -