తమిళనాడులో నీటి పంపకాల్లో కేంద్రం మాకు అన్యాయం చేసిందని, కావేరి జలమండలి బోర్డును ఏర్పాటు చేయాలని అటు పార్లమెంటులో ఎంపీలు ఇటు తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై తమ వాదనను గట్టిగా వినిపించాయి. అటు రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, యువత పెద్ద ఎత్తున గళమెత్తి నీటి పంపకాల విషయంలో ఇప్పటికైనా తమిళనాడుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఈ సెగ రాను రాను ఐపీఎల్ క్రికెట్ కు తాకింది.
అమ్మ మక్కల్ మునేట్ర కళగం పార్టీ ఛీఫ్, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ శుక్రవారం త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ క్రికెట్ లను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కావేరీ జలమండలి బోర్డు ఏర్పాటు బాధ్యత కేంద్ర సర్కార్ధేనని తెలిపారు. పళాని స్వామి ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై రైతులు శుక్రవారం భూమిలో సజీవ సమాది అయి విన్నూత్నంగా నిరసన తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వారిని బయటకు తీశారు.