మరోసారి మంటలు రేపబోతున్న ఎన్టీఆర్‌

1155
NTR-Dhee-10
- Advertisement -

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో వైబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఎన్టీఆర్‌ పేరు చెబితేనే ఆయన ఫాలోవర్స్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తారక్‌ కేవలం బిగ్‌ స్క్రీన్‌ మీదే కాదు.. బుల్లితెర మీద హావా కొనసాగించగలనని నిరూపించాడు. గతేడాది ఇదే సమయానికి స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్‌ బాస్‌ షోకు మొదటి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్‌ దుమ్ములేపాడు. తన మాటల చాతూర్యంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్‌ మాటల మాధుర్యంతోనే స్టార్‌ మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్‌ బాస్‌ షోకు మొదటి సీజన్‌ విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ 2 లో కూడా ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ బిగ్‌ బాస్‌ 2 కు నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

NTR-Dhee-10

అయితే ఇప్పుడు తాజాగా మరోసారి స్మాల్‌ స్క్రీన్‌ పై సందడి చేయబోతున్నాడు. అదేంది ఎన్టీఆర్‌ మళ్లీ ఏ షోకు వ్యాఖ్యాతగా వ్యహరించబోతున్నాడని అనుకుంటున్నారా… మీరు అనుకుంటున్నట్టుగా ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా కనిపించడం కాదు.. ఓ టీవీలో ప్రసారమవుతున్న ఓ పాపులర్‌ గేమ్‌ షోలో గెస్ట్‌ గా కనిపించబోతున్నాడు. ఒకరోజు కాదు.. ఏకంగా రెండు రోజులు ఆ టీవీలో తారక్‌ సందడి చేయబోతున్నాడు. ఇంతకు అది ఏ టీవీ… ఏ షో అని ఆలోచిస్తున్నారా… ఈటీవీలో ప్రసారమవుతున్న టాప్‌ షో ఢీ 10.

NTR-Dhee-10

ఢీ పదో వార్షికోత్సవం సందర్భంగా గ్రాండ్‌ ఫినాలెను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ షో బుల్లితెరపై టాప్‌ రేటింగ్స్‌ లో కొనసాగుతోంది. ఈ షోకు సంబంధించిన ఫైనల్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ ఈ మధ్యనే జరిగింది. ఈ షో ఫైనల్‌ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ హాజరయ్యాడు. ఎన్టీఆర్‌ ఈ షోకు గెస్ట్‌ గా రావడంతో ఆయనపై ఓ ప్రోమోను కట్‌ చేశారు. ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

- Advertisement -