హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. దొరికిన హీరోయిన్

266
prostitution

హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వ్యభిచారం చేస్తూ ఓ ప్రముఖ హీరోయిన్ పట్టుబడింది. శనివారం రాత్రి ఫైవ్ స్టార్ హోటల్‌పై దాడులు నిర్వహించిన నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందాను బట్టబయలు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబరు 5 లోని రాడిసన్ బ్లూ ప్లాజా ఫైర్ స్టార్ హోటల్లో ముంబయికి చెందిన భోజ్ పురి నటి ఒకరు శనివారం రాత్రి అడ్డంగా దొరికిన వైనం బయటకు వచ్చింది.

prostitution

సంపన్నులకు అందమైన సినీ తారలు.. మోడల్స్ ను ముంబయి నుంచి తీసుకొచ్చి స్టార్ హోటళ్లలో ఖరీదైన వ్యభిచార సేవల్ని అందించే అంబుల జనార్ధన్ రావు అలియాస్ జానీని.. సదరు నటిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి రూ. 40,400 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ డిప్యూటీ కమీషనర్‌ రాధాకృష్ణారావు వెల్లడించారు. గత కొంత కాలంగా కాస్టింగ్‌ కౌచ్‌ తో తెలుగు చిత్ర పరిశ్రమలో పెనుదుమారం రేగగా, తాజాగా హైదరాబాద్ కేంద్రంగా స్టార్ హోటల్లో జరుగుతున్న ఈ గలీజు దందా బయటకు రావటంతో చిత్రపరిశ్రమ మరోసారి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.