తడబడ్డా….క్లీన్ స్వీప్ చేశారు

229
india vs westindies
- Advertisement -

విండీస్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. ఆదివారం జరిగిన మూడో టీ20లో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రోహిత్ సేన ఘనవిజయం సాధించింది. భారత్‌ గెలవాలంటే 12 బంతుల్లో 8 పరుగులే చేయాలి.. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ధావన్,పంత్ క్రీజులో ఉన్నారు. భారత్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు అంతా. కానీ కరీబియన్ బౌలర్ల నుంచి ఉహించని ప్రతిఘటన రావడంతో చివరిబంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీమిండియా గట్టెక్కింది.

విండీస్‌ విధించిన 182 పరుగుల లక్ష్యఛేదనలో ఆరంభంలో భారత్ తలపడింది. రోహిత్‌ (4),రాహుల్‌ (17) ఆరంభంలోనే తడబడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పంత్‌తో ధావన్‌ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్‌ (92; 62 బంతుల్లో 10×4, 2×6), రిషబ్‌ పంత్‌ (58; 38 బంతుల్లో 5×4, 3×6) విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

అంతకుముందు హోప్‌ (24), హెట్‌మయర్‌ (26) ,డారెన్‌ బ్రావో (43), పూరన్‌ (53) ధాటిగా ఆడారు. ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో బ్రావో, పూరన్‌ 23 పరుగులు రాబట్టడంతో విండీస్‌ 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది.ధావన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, కుల్‌దీప్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు దక్కాయి. కరీబియన్‌ జట్టుతో టెస్టు, వన్డే సిరీస్‌ను నెగ్గిన భారత్ టీ20 సిరీస్‌ను కూడా గెలిచింది.

- Advertisement -