అందుకే రాజీనామా చేశా!

0
- Advertisement -

NEET (UG) పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ బొద్దింక జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనల అనంతరం, కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడంపై వివరణ ఇస్తూ— Gen Zని ‘దారి మళ్లించేందుకు’ ప్రయత్నాలు జరిగాయని, అందుకే తను పదవిని వీడాల్సి వచ్చిందని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న GM యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంబల్‌పూర్ లోక్‌సభ సభ్యుడైన ప్రధాన్ మాట్లాడుతూ… తను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కేంద్ర మంత్రిమండలికి రాజీనామా సమర్పించానని తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, భారత్‌ను ‘విశ్వగురు’గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Gen Z మన పిల్లలు. కొందరు వారిని దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నాకు వ్యక్తిగత సమస్యలేవీ లేవు. భారతదేశంలో ప్రతి ఏటా కనీసం రెండు కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో 20 కోట్ల మంది పిల్లలు పుట్టారు. వారికి ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి, వారే భారత్‌ను ‘విశ్వగురు’గా మారుస్తారు. నాకు పదవి ముఖ్యం కాదు అని ప్రధాన్ పేర్కొన్నారు.

Also Read:‘శివ గాడి జింద‌గీ’..టైటిల్ సాంగ్ లాంచ్!

CJP చేపట్టిన నిరసనలు ప్రారంభమైన దాదాపు నెల రోజుల తర్వాత, జులై 25న ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.అభీజిత్ దిప్కే నాయకత్వంలోని CJP, NEET (UG) పేపర్ లీక్‌పై చర్యలు తీసుకోవాలని మరియు ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అంతకుముందు ప్రధాన్ రాజీనామా చేయరని, దానికి మొత్తం కేంద్ర మంత్రివర్గం మద్దతు ఉందంటూ వార్తలు వచ్చినప్పటికీ, చివరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రహ్లాద్ జోషిని తాత్కాలిక విద్యాశాఖ మంత్రిగా నియమించారు.

తన రాజీనామా లేఖలో ప్రధాన్ మాట్లాడుతూ… ఈ అంశం తనకు ఎప్పుడూ “వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని”, బాధ్యతాయుతమైన భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పునరుద్ఘాటించారు.

- Advertisement -