ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఉదయం 7.30 గంటలకు బ్రీచ్ కాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించనున్నట్లు డాక్టర్లు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆయనను అక్టోబర్ 31న ఆసుపత్రిలో చేర్చారు.
బుధవారం తెల్లవారుజామున ధర్మేంద్ర నివాసం వైపు వెళ్తున్న అంబులెన్స్ కనిపించగా, కొద్ది సేపటిలోనే బ్రీచ్ క్యాండీ వైద్యులు ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, చికిత్స ఇకపై ఇంట్లోనే కొనసాగుతుందని ధృవీకరించారు.
సోమవారం కొన్ని మీడియా పోర్టల్‌లు ధర్మేంద్ర మరణించారని తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. దీనిపై ఆయన కుమార్తె ఈషా దియోల్ తీవ్రంగా స్పందిస్తూ, తన తండ్రి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది. నా నాన్నగారు స్థిరంగా ఉన్నారు, కోలుకుంటున్నారు. మా కుటుంబానికి గోప్యత ఇవ్వాలని మనవి. మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించినందుకు ధన్యవాదాలు అని రాశారు.
తరువాత ధర్మేంద్ర రెండో భార్య, హేమా మాలిని కూడా ఒక ప్రకటన విడుదల చేసి, ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:గత వైభవం..బ్లాక్ బస్టర్ కావాలి: నాగ్

