బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 65 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఒక్క ఇమ్మూ మినహా అంతా ఉన్నారు. ఈవారం హౌస్ మొత్తాన్ని బీబీ రాజ్యంగా మార్చేశాడు. రీతూ, కళ్యాణ్, దివ్య ఈ వారానికి బీబీ రాజ్యానికి రాజు, రాణులు.. వీళ్లకి ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి.. వీరికి బెడ్‌రూమ్‌లో నివసించే హక్కు ఉంది.. అలాగే పూర్తి ఇంటికి యాక్సెస్ కూడా లభిస్తుంది అని చెప్పాడు బిగ్‌బాస్.
ఇక మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే వీళ్లకి ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా అని వీళ్లు సేఫ్ అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్లని ఓడించి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి మిగతావారికి కూడా అవకాశం లభించనుంది.. ఇలా వారం ముగిసేసరికి అందరిలో ఒక్కరే ఇమ్యూనిటీ పొందుతారు.. ఆ ఒక్కరే ఈ ఇంటి కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు.
పవర్ రాగానే దివ్య-రీతూ ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూలు చేసినట్లుగా కొశ్చన్స్ అడిగారు. చివరికి కమాండర్లుగా నిఖిల్, సంజన, తనూజ, డీమాన్‌లని సెలక్ట్ చేశారు. దీంతో కమాండర్స్ ఇప్పటినుంచి రోజ్ రూమ్‌లో ఉంటారు.. ప్రజలు మాత్రం బయట డెన్‌లో ఉండాలి అంటూ బిగ్‌బాస్ షాకిచ్చాడు. అలానే రాజు, రాణులు, కమాండర్స్ ఇంట్లో ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. పూర్తి పనులన్నీ ప్రజలు అయిన భరణి , ఇమ్మానుయేల్, సుమన్ శెట్టి, గౌరవ్ మాత్రమే చేయాలని ఆదేశించాడు బిగ్‌బాస్.
కమాండర్స్‌కి ఒక టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. కమాండర్స్‌లో ఒకరు వాళ్ల స్థానాన్ని రిస్క్‌లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వారితోటి పోరాడాల్సి ఉంటుంది..ఈ పోటీలో వాళ్లు విజయం సాధిస్తే కమాండర్‌గా తమ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు.. ఒకవేళ ఓడిపోతే గెలిచిన సభ్యులు వాళ్ల స్థానాన్ని తీసుకొని కొత్త కమాండర్ అవుతారు. ఇక కమాండర్స్ నలుగురిలో ఎవరు ప్రజలతో పోరాడతారో తెలుసుకోవడానికి ముందుగా ఒక పరీక్ష పెట్టాడు. అందులో ఓడిపోయినవారు ప్రజలతో పోటీపడాల్సి ఉంటుంది.. ఇందుకోసం కమాండర్స్‌కి ‘విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్’ అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్.
Also Read:నాగ్‌పై కామెంట్స్…కొండా పశ్చాత్తాపం

