సొంతగూటికి ధర్మపురి శ్రీనివాస్..?

42
ds

నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ సొంత గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఢిల్లీ చేరుకున్న ఆయనతో ఏఐసీసీ చర్చలు జరుపుతుండగా ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్నారు పార్టీ పెద్దలు. ఈ మేరకు ఢిల్లీకి రావాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అధిష్టానం ఫోన్ చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చక్రం తిప్పారు డీఎస్. రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం టీఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు.